Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Updated on: Oct 09, 2022 | 6:01 PM

పాకిస్థాన్ కు చెందిన అరవై ఏళ్ల షాకత్ గత ఏడాదే ఫ్రెష్‌గా ఐదో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే పదకొండు మందది పిల్లలు. వీరిలో 10 మంది అమ్మాయిలు కాగా.. ఒకే ఒక్క అబ్బాయి...


నిత్య పెళ్లి కొడుకుల గురించి వినే ఉంటాం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేయడం వంటివి మనకు తెలిసిందే. కానీ ఇక్కడ జరిగిన ఓ పెళ్లి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అది కూడా ఆయన చేసుకుంది 60 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యుల సంఖ్య 62. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే ఆయన కుటుంబ సభ్యులే ఆ పెద్దాయనకి దగ్గరుండి ఐదో పెళ్లి చేయడం. అంతేనా… ఆయన మనవళ్లు అయితే తాతయ్య పెళ్లి- జరగాలి మళ్లీ మళ్లీ అంటూ పండగ చేసుకుంటున్నారు. పాకిస్థాన్ కు చెందిన అరవై ఏళ్ల షాకత్ గత ఏడాదే ఫ్రెష్‌గా ఐదో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే పదకొండు మందది పిల్లలు. వీరిలో 10 మంది అమ్మాయిలు కాగా.. ఒకే ఒక్క అబ్బాయి. వీరందరి పిల్లలతో కలిపి మొత్తంంగా ఈ కుటుంబ సభ్యుల సంఖ్య అక్షరాలా అరవై రెండు మంది. తన ఐదో పెళ్లికి ముందే తన ఎనిమిది మంది ఆడపిల్లలకు ఒకే ఒక్క కొడుక్కి పెళ్లి చేశారు షాకత్. అయితే మిగిలిన ఇద్దరు పెళ్లికాని అమ్మాయిలు. తమ తండ్రి ఒంటరిగా ఉండకూడదని, పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలని పట్టుపట్టారు. షాకత్ తన ఇద్దరు కూతుళ్లకు పోయినేడాది పెళ్లి చేశారు. అదే సమయంలో తాను కూడా ఐదో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు. ఇంత వయసున్న తాతయ్యను పెళ్లాడ్డం మీకెలా ఉంది అని అడిగితే ఆమె ఆనందానికి అవథులు లేకుండా పోయాయి. ఇంత పెద్ద కుటుంబంలో తాను కూడా ఒక సభ్యురాలిని కావడం గొప్పగా ఉందని అంటారామె. అయితే.. ఈ మతాచారంలో బహుభార్యత్వం, బహుళ వివాహాలకు అనుమతి ఉంది. కానీ అదేం తప్పని సరి కాదు. ఈ విషయం షాకత్ కి కూడా బాగా తెలుసు. కానీ పరిస్థితులు అలా కలిసొచ్చాయని అంటారాయన. మొదటి నాలుగు పెళ్లిళ్లు ఎలా జరిగినా, ఐదో పెళ్లి మాత్రం తన చిన్న కూతుళ్ల ప్రోద్బలంతో చేసుకున్నానని ఆయన చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Published on: Oct 09, 2022 06:01 PM