Monkey: కోతిని పట్టుకుంటే రూ.500.. పట్టుకోండి చూద్దాం.. వీడియో.

|

Mar 13, 2023 | 9:06 AM

కాకినాడ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువై పోయింది. పంటపొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటల్లో పంటను నాశనం చేస్తున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.

కాకినాడ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువై పోయింది. పంటపొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటల్లో పంటను నాశనం చేస్తున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని సార్లు మనుషులపైనా దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్‌లు, గ్రామ పంచాయితీ అధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. దీంతో కోతుల బెడదకు చెక్‌ పెట్టాలని భావించిన ఆయాగ్రామాల సర్పంచ్‌లు వినూత్నంగా ఆలోచించారు. కోతిని పట్టుకుంటే ఒక్కో కోతికి 500 రూపాయలు ఇస్తానని ప్రకటించారు.దాంతో రంగంలోకి దిగిన మంకీ క్యాచర్‌ టీం కోతుల పనిపట్టే కార్యక్రమం చేపట్టారు. కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులు, ఉచ్చులు ఏర్పాటు చేసి అందులో ఆహారం ఎరగా వేశారు. దాంతో నాలుగు రోజుల్లోనే వందల కోతులు బోనులో చిక్కుకున్నాయి. వాటిని సురక్షితంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. మంకీ క్యాచర్ మాట్లాడుతూ వాటికి ఆహారం, నీరు అన్నీ అందుబాటులో ఉన్న ప్రాంతంలోనే విడిచిపెడతామని తెలిపారు. కోతులనుంచి తమ పంటలను, పిల్లలను కాపాడినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 13, 2023 09:06 AM