Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??
సభ్య సమాజం నియమాలకు భిన్నంగా ఉంటాయి గిరిజనుల ఆచారాలు. మధ్యప్రదేశ్‌లో అలీరాజ్‌పూర్ గిరిజన తెగకు చెందిన సమర్థ్ మౌర్య అనే వ్యక్తి ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా సహజీవనం చేశాడు.
సభ్య సమాజం నియమాలకు భిన్నంగా ఉంటాయి గిరిజనుల ఆచారాలు. మధ్యప్రదేశ్‌లో అలీరాజ్‌పూర్ గిరిజన తెగకు చెందిన సమర్థ్ మౌర్య అనే వ్యక్తి ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుకకు గ్రామస్తులందరూ తరలిరాగా వైభవంగా పెళ్ళి చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేశానని అన్నాడు. ఏప్రిల్ 30న ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

