Vehicle Crash: వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం.. టెక్సాస్ లో హైదరాబాదీలు మృతి.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. మరొకరు తమిళనాడు వాసి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. మరొకరు తమిళనాడు వాసి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని తెలిపారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.