36 పేజీలలో 36 పెళ్లి తంతు వివరాలు ఈ శుభలేఖ వెరీ స్పెషల్
వివాహాది శుభలేఖను ఏకంగా 36 పేజీలతో పెళ్లి పుస్తకంలా ముద్రించిన కుటుంబం గురించి ఇప్పుడు బంధుగణం కరీంనగర్‌లో చర్చించుకుంటున్నారు. వివాహ విశిష్టత అంశాలను పేర్కొంటూ ముద్రించిన 36 పేజీల శుభలేఖ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్-శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. మొదటి కూతురు రవళిక సీఏ పూర్తి చేసింది.
ఇటీవలే కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్ర బాబుతో ఫిబ్రవరి 23వ తేదీన వివాహం నిశ్చయమైంది. తమ వివాహ వేడుక అందరికి గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నారు. వెడ్డింగ్ కార్డు సింపుల్‌గా ఉంటే ఏం బాగుంటుంది అనుకుంది ఆ కుటుంబం. వివాహ ఆహ్వాన పత్రికను పుస్తకం రూపంలో ప్రింట్ చేయించారు. వివాహానికి సంబంధించిన క్రతువులను పెళ్లిచూపులు, శుభ ముహూర్తాన్ని నిశ్చయించి పత్రిక రాసుకోవడం, పెళ్లి కుమార్తెను చేయడం, పెళ్లి కుమారుని చేయడం, పాణిగ్రహణం, వరపూజ, వధువును గంపలో తీసుకు వచ్చే తంతు, తెరసాల, కన్యాఫలం , మాంగల్య పూజ, జీలకర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది, ఉంగరాలు తీయించడం, అప్పగింతల పాట తో పాటు పెళ్లిలో జరిగే 36 తంతుల గురించి ఒక్కొక్క పేజీలో ముద్రించి తన కుమార్తె వివాహానికి అందరూ రావాలంటూ అందరినీ ఆహ్వానిస్తున్నారు సుద్దాల దంపతులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాటి చెట్టు పైకి గీత కార్మికుడు కుండలో కనిపించింది చూసి షాక్