తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూస్తే కళ్లు జిగేల్..
పురావస్తు తవ్వకాల్లో జరుగుతున్న ప్రతీసారి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ పలు నిధి నిక్షేపాలు బయటపడుతుంటాయి. వాటిని పరిశీలించి చూడగా ఏళ్ల నాటి చరిత్రలు వెలుగులోకి వస్తుంటాయి.
పురావస్తు తవ్వకాల్లో జరుగుతున్న ప్రతీసారి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ పలు నిధి నిక్షేపాలు బయటపడుతుంటాయి. వాటిని పరిశీలించి చూడగా ఏళ్ల నాటి చరిత్రలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ అరుదైన ఘటన ఇజ్రాయిల్‌లో చోటు చేసుకుంది. దక్షిణ ఇజ్రాయిల్ కోస్టల్ ఏరియాలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అక్కడ వారిని ఆశ్చర్యపరుస్తూ 3300 ఏళ్ల నాటి ఓ గుహ బయటపడింది. ఇక అందులో వేల సంఖ్యలో కుండలు, కంచు వస్తువులు, దీపాలు, బాణాలు, ఈటెలు కనిపించాయి. బీచ్‌కు అతి సమీపంలో ఈ తవ్వకాలు జరిపారు. ఈ చారిత్రాత్మిక గుహలో లభించిన వస్తువులన్నీ 13వ శతాబ్దం, ఈజిప్టు చక్రవర్తి ఫారో రామెసెస్ II కాలం నాటివిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుహలోని వస్తువుల పరిమాణం చాలా విభిన్నంగా ఉన్నాయని.. చాలా అరుదైన వస్తువులుగా శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే వారికి ఈ కంచు వస్తువులతో పాటు పలు ఆస్థి పంజరాలు కూడా లభ్యమయ్యాయి. అవి యుద్దవీరులు లేదా ఓడ కాపలాదారులకు సంబంధించినవి కావొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేసారు. కాగా, ఈ గుహ ఆవిష్కరణ అస్సలు నమ్మశక్యం కానిదని, ఇలాంటి గుహలు ఇంతకుముందెప్పుడూ కనుగొనబడలేదని తెలిపారు. 3300 సంవత్సరాలుగా ఇలాంటివి చాలానే ఉన్నాయని, వీటిని ఎవ్వరూ గుర్తించలేకపోయారని పురావస్తు శాస్త్రవేత్త డేవిడ్ గెల్మాన్ వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాల్ ఇంటిపై దాడి.. భయాందోళనలో హీరో ఫ్యామిలీ