Famous Snake man: ఎంతటి పామునైనా పట్టుకోవడంలో అతను దిట్ట.. కానీ అంతలోనే..!

|

Nov 13, 2022 | 9:34 AM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన 60 ఏళ్ల మోతీరామ్ పాములు పట్టడంలో దిట్ట. స్థానికుల ఇళ్లల్లో పాములు కనిపిస్తే వాటిని ఓ బ్యాగులో పట్టి దగ్గరలోని అడవులలో, దట్టమైన పొదలలో సురక్షితంగా వదిలిపెట్టేవాడు.


ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన 60 ఏళ్ల మోతీరామ్ పాములు పట్టడంలో దిట్ట. స్థానికుల ఇళ్లల్లో పాములు కనిపిస్తే వాటిని ఓ బ్యాగులో పట్టి దగ్గరలోని అడవులలో, దట్టమైన పొదలలో సురక్షితంగా వదిలిపెట్టేవాడు. ఇలా దాదాపు 30 సంవత్సరాలుగా ఎటువంటి పాములైనా పడుతున్న మోతీరామ్‌ను స్థానికులంతా ‘స్నేక్ మ్యాన్’ అని పిలిచేవారు. అయితే ఈ క్రమంలోనే బరేలీ రాజేంద్ర నగర్‌లోని ఇక ఇంట్లో తాచు పాము ఉందని తెలిసి దానిని పట్టడానికి వెళ్లాడు మోతీరామ్. విష పామును పట్టుకుని బ్యాగ్‌లో వేస్తుండగా అతన్ని కాటేసింది. విషసర్పం కావడంతో స్థానికులు వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా ప్రాణాలు దక్కలేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో వేల పాములు పట్టాడు. కానీ ఈ రోజు కలిసి రాకపోవడంతో ఇదే ఆయనకు చివరి రోజుగా మారింది. పాము కాటుతోనే ప్రాణాలు కోల్పోయారంటూ మోతీరామ్ కుటుంబసభ్యులు, స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Follow us on