Mosquito bite effect: చిన్న దోమకాటుకు 30 ఆపరేషన్లు.. చివరికి కోమాలోకి వెళ్లిన వ్యక్తి..! ఎందుకంటే..
జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్‌ష్కేకి అనే వ్యక్తిని ఓ దోమ కరిచింది. దాంతో అతనికి ఇన్‌ఫెక్షన్ సోకింది. అది క్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించి అవి పనిచేయడం మానేసాయి.
జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్‌ష్కేకి అనే వ్యక్తిని ఓ దోమ కరిచింది. దాంతో అతనికి ఇన్‌ఫెక్షన్ సోకింది. అది క్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించి అవి పనిచేయడం మానేసాయి. చివరికి అతను దోమ కరిచినచోట చర్మ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది. ఆసియా టైగర్ దోమ సెబాస్టియన్ ఎడమ తొడపై కుట్టింది. దోమ కాటు ద్వారా సెరాటియా అనే బ్యాక్టరీయా శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అతడిలో ఫ్లూ వంటి లక్షణాలు కూడా కనిపించాయట.. ఆ తర్వాత రాను రాను అతడి ఆరోగ్య పరిస్థితి రోజు రోజూకు దిగజారిపోయింది. ఇన్‌ఫెక్షన్‌తో తొడ భాగం మొత్తం పాడవడంతో.. అతడు మంచానికే పరిమితమయ్యాడు. చివరకు ఓ రోజు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు కోమాలోకి వెళ్లిపోయాడు.దోమ కాటు వల్ల తొడపై చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఆ తర్వాత మరో 30 రకాల ఆపరేషన్లు కూడా జరిగాయట.. రెండు కాలి వేళ్లను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం సెబాస్టియన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కానీ అతను మునపటిలా పూర్తి ఆరోగ్యంగా ఉండలేడని, ఇలాంటి దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

