Viral: ఒకే మొక్కకు మూడు రకాల కూరగాయలు..! టమాటా + పొటాటో = పొమాటో.

|

Oct 20, 2023 | 9:09 PM

కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెజిటబుల్‌ రిసెర్చ్‌ పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఏక కాలంలో వంకాయలు, టమాటాలు, మిరపకాయలు పండే మొక్కను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదన్నారు. గతంలో ఆలు, టమాటాలు పండే ఓ మొక్కను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి పొమాటో అని పేరుపెట్టారు.

కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెజిటబుల్‌ రిసెర్చ్‌ పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఏక కాలంలో వంకాయలు, టమాటాలు, మిరపకాయలు పండే మొక్కను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదన్నారు. గతంలో ఆలు, టమాటాలు పండే ఓ మొక్కను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి పొమాటో అని పేరుపెట్టారు. గతంలో ఒకే మొక్క నుంచి బంగాళాదుంపలు, టమాటాను పండించే పొమాటో, వంకాయ-టమాటాను పండించే బ్రిమాటో మొక్కలను అభివృద్ధి చేశారు. గ్రాఫ్టింగ్‌ టెక్నిక్‌ని ఉపయోగించి ఐసిఎఆర్‌-ఐఐవిఆర్‌ శాస్త్రవేత్తలు మొదట పొమాటోను అభివృద్ధి చేశారు. ఐఐవిఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టికె బెహెరా మార్గదర్శకత్వంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ అనంత్‌ బహదూర్‌, వారణాసిలో మూడు కూరగాయలు అందించే పంట ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఈ ప్రక్రియలో వంకాయ వేరు కాండం మీద మిరప, టమాటా మొక్కలను అంటుకట్టారు. 2024 జనవరి చివరి నాటికి మిరపకాయ, బెండకాయ, టమాటా దిగుబడి కూడా ప్రారంభం అవుతుందని డాక్టర్‌ బహదూర్‌ చెప్పారు. దీని సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నామన్నారు. ఒక మొక్క కనీసంగా 3 కిలోల టమాటా, 2.5 కిలోల బెండకాయల దిగుబడిని ఇస్తుందని చెప్పారు. ఈ మొక్కలు కిచెన్‌ గార్డెన్స్‌, పెరడులోను, చిన్న పొలాల్లో సాగు చేసుకునేందుకు వీలుగా ఉంటాయని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..