భారీ క్రేన్‌తో సహాయంతో ఆస్పత్రికి వ్యక్తి తరలింపు !! ఎందుకిలా చేశారో తెలుసా ??

Updated on: Oct 11, 2025 | 3:30 PM

ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏకంగా ఓ భారీ క్రేన్‌ ను వాడారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ అవసరం. కానీ క్రేన్‌తో పనేంటీ అనుకుంటున్నారా? అయితే మీరు ఆ వ్యక్తి బరువెంతో తెలుసుకోవాల్సిందే. ఏకంగా 273 కేజీల బరువు ఉన్న వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు క్రేన్‌ వాడాల్సి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

274 కేజీల ఊబకాయంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అత్యవసర వైద్యం అందించాల్సి వచ్చింది. అతను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. సాధారణంగా స్ట్రెచర్‌పై పడుకోబెట్టి అతని ప్లాట్‌ నుంచి కిందికి తీసుకురావడం అసాధ్యం. అందుకే ఆసుపత్రి అధికారులు, ఫైర్‌ సిబ్బంది కలిసి ఒక పక్కా ప్లాన్తో ఆ భారీకాయుడిని బిల్డింగ్‌ నుంచి కిందికి దింపి, ఆస్పత్రికి తరలించారు. ఇందుకు ఇంటి బాల్కనీ గోడను కొంత మేర పగులగొట్టి తొలగించారు. ఓ 12 మంది ట్రైన్డ్ సిబ్బంది ఆ వ్యక్తిని ఎంతో శ్రమించి బిల్డింగ్‌ నుంచి కిందికి దించారు. ఇది చూసేందుకు చుట్టుపక్కల జనం గుమిగూడారు. అమెరికాలో ఊబకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొన్నేళ్ల తర్వాత అమెరికాను సైతం వెనక్కి నెట్టి ఊబకాయుల సంఖ్యలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో నిలవనుందని ప్రఖ్యాత లాన్సెట్‌ జర్నల్‌ అంచనా వేసింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం స్థూలకాయులేనని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఊబకాయానికి ప్రధాన ఔషధం మైండ్‌ ఫుల్‌ ఈటింగ్‌ అని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. తినే టైం అయ్యిందని ఆదరాబాదరాగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. యువత, చిన్నారుల్లో స్థూలకాయం రావడానికి ప్రాసెస్డ్‌ ప్యాకింగ్‌ ఫుడ్ ప్రధాన కారణమని వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ చెబుతోంది. పిల్లలు అధికంగా మొబైల్‌ ఫోన్లకు, టీవీలకు అలవాటుపడడం మైదానంలో ఆటలు ఆడకుండా ఉండటం కూడా లావైపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NRI Marriages: అమెరికా పెళ్లి సంబంధాలపై తగ్గుతున్న మోజు

ఆ రెండు దగ్గు సిరప్‌లు బ్యాన్‌రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు

Rukmini Vasanth: కాంతార… కాంత రుక్మిణి చరిత్ర తెలుసా ??

శ్రీవారి క్యాలెండర్లు రెడీ.. ఈసారి ఆన్‌లైన్‌లోనూ డెలివరీ

లేటుగా వచ్చారా.. రంగు డబ్బా కొనుక్కురండి విద్యార్ధులకు ప్రిన్సిపాల్ వింత పనిష్మెంట్‌