Delhi: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. రన్‌వేపై ఒకే టైమ్‌కి 2 విమానాలు ల్యాండిగ్, టేకాఫ్..
ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపైకి రావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండూ.. విస్తారా విమానాలే కావడం గమనార్హం. ఢిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే725 విమానం టేకాఫ్ అయ్యేందుకు ఢిల్లీ విమనాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేపైకి వచ్చింది.
ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపైకి రావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండూ.. విస్తారా విమానాలే కావడం గమనార్హం. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే725 విమానం టేకాఫ్ అయ్యేందుకు ఢిల్లీ విమనాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేపైకి వచ్చింది. అదే సమయంలో అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వస్తున్న విస్తారా విమానానికి ఏటీసీ అనుమతి లభించడంతో పక్కనే ఉన్న మరో రన్‌వేపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలో ల్యాండ్ అయిన విమానం.. ఢిల్లీ-బాగ్‌డోగ్రా విమానం ఉన్న రన్‌వేపైకి వస్తుండటం గుర్తించిన ఏటీసీ అధికారులు టేకాఫ్ ఆపేయాలని పైలట్‌కు సూచించారు. వెంటనే విమానాన్ని పార్కింగ్ బే కు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యేప్పుడు రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలను అనుమతించరు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్ అవుతుంటే.. పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...