Elon Musk Video: యావత్‌ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న ‘ఎలన్‌ మస్క్‌’నే భయపెట్టిన 19 ఏళ్ల కుర్రాడు..!(వీడియో)

|

Feb 13, 2022 | 8:51 AM

ఎలన్‌ మస్క్‌.. ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పవచ్చు. స్పేస్‌ఎక్స్‌, టెస్లా కంపెనీలతో యావత్‌ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. అలాంటి ఎలన్‌ మస్క్‌ను ఓ 19 ఏళ్ల కుర్రాడు భయపెట్టాడు. జాన్‌ స్వీనీ అనే యువకుడికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం..


ఎలన్‌ మస్క్‌.. ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పవచ్చు. స్పేస్‌ఎక్స్‌, టెస్లా కంపెనీలతో యావత్‌ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. అలాంటి ఎలన్‌ మస్క్‌ను ఓ 19 ఏళ్ల కుర్రాడు భయపెట్టాడు. జాన్‌ స్వీనీ అనే యువకుడికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం.. తన సొంత నైపుణ్యంతో విమానాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. దానిని ఉపయోగించి ప్రైవేటు వ్యక్తుల విమానాలు ఎప్పుడు, ఎక్కడ ఉంటున్నాయో ఇట్టే చెప్పేస్తున్నాడు.. అదీ ట్విట్టర్‌లో.. ఇలా ఈ కుర్రాడు ట్రాక్‌ చేస్తున్న విమానాల్లో ఎలన్‌మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌గేట్స్‌ లాంటి ప్రముఖులే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మస్క్‌ స్వీనీని సోషల్‌ మీడియా ద్వారానే సంప్రదించాడు. తాను చేస్తున్న పనివల్ల చాలా నష్టపోతున్నామని, దానిని ఆపేయాలని, అందుకుగాను ఆ కుర్రాడికి 5,000 డాలర్లు ఇస్తానని మస్క్‌ ఆఫర్‌ చేశారు. అయితే అందుకు నిరాకరించిన స్వీనీ తనకు 50,000 డాలర్లు కావాలని డిమాండ్‌ చేసాడు. ఆ డబ్బుతో తాను స్కూలు పీజు చెల్లిస్తానని, అలాగే తనకెంతో ఇష్టమైన టెస్లా కారు కొనుక్కుంటానని చెప్పాడు. అంతేకాదు ఎలన్‌ మస్క్‌కు తాను పెద్ద అభిమానినని స్వీని తెలిపాడు. మొత్తానికి కుర్రాడి డిమాండ్‌ను అంగీకరించిన మస్క్‌ తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించారట. అయితే స్వీనీ ఇలా మొత్తం 15 మంది ప్రముఖ వ్యక్తుల విమానాల కదలికల్ని ట్రాక్‌ చేస్తున్నాడు. దాని వల్ల తాను చాలా నేర్చుకున్నానని స్వీనీ పేర్కొన్నాడు.