America: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 150 కార్లు ఢీ.. ఏడుగురు దుర్మరణం..! వీడియో.

|

Oct 24, 2023 | 9:03 PM

పొగ మంచు ప్రాణాల మీదకు తెస్తోంది. రోడ్లపై ఎదురెదురు వాహనాలు కనిపించనంతగా మంచు ఆవరించింది. అమెరికా లూసియానాలో దట్టంగా కురిసిన పొగమంచు ఏడుగురి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సెయింట్ జాన్ బాప్టిస్ట్ ఇంటర్‌స్టేట్‌లో దట్టంగా అలుముకున్న పొగతో దారి కనిపించక వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా..

పొగ మంచు ప్రాణాల మీదకు తెస్తోంది. రోడ్లపై ఎదురెదురు వాహనాలు కనిపించనంతగా మంచు ఆవరించింది. అమెరికా లూసియానాలో దట్టంగా కురిసిన పొగమంచు ఏడుగురి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సెయింట్ జాన్ బాప్టిస్ట్ ఇంటర్‌స్టేట్‌లో దట్టంగా అలుముకున్న పొగతో దారి కనిపించక వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. 25మంది గాయపడినట్లు తెలిపారు. ఈ పొగమంచుతో దాదాపు 150పైగా వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లుగా పోలీసులు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో కొన్నివాహనాలు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపిన లూసియానా గవర్నర్‌ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..