Guinness Record: పేక మేడలని తీసిపారేయకండి.. 11 అడుగుల ఎత్తైన మేడ కట్టిన 15 ఏళ్ళ బాలుడు..

|

Oct 09, 2023 | 1:53 PM

ఇంతవరకూ పేకాట ఓ జూదంగానే మనకు తెలుసు. అలాగే ఆడి పడేసిన పేక ముక్కలతో చిన్నపిల్లలు సరదాగా మేడలు కడుతుంటారు. అవి అప్పటికప్పుడే కూలిపోతుంటాయి. కానీ ఈ బాలుడు ఏకంగా పేకలతో పెద్ద పెద్ద బిల్లింగులే కట్టేశాడు. అవును, పేక ముక్కలతో అతిపెద్ద నిర్మాణం కట్టి రికార్డు సృష్టించాడు. ఏకంగా 11 అడుగులకు పైగా ఎత్తు, 16 అడుగులకు పైగా వెడల్పు, 40 అడుగుల విస్తీర్ణంలో నాలుగు నిర్మాణాలను ఈ పేక ముక్కలతోనే కట్టేశాడు.

ఇంతవరకూ పేకాట ఓ జూదంగానే మనకు తెలుసు. అలాగే ఆడి పడేసిన పేక ముక్కలతో చిన్నపిల్లలు సరదాగా మేడలు కడుతుంటారు. అవి అప్పటికప్పుడే కూలిపోతుంటాయి. కానీ ఈ బాలుడు ఏకంగా పేకలతో పెద్ద పెద్ద బిల్లింగులే కట్టేశాడు. అవును, పేక ముక్కలతో అతిపెద్ద నిర్మాణం కట్టి రికార్డు సృష్టించాడు. ఏకంగా 11 అడుగులకు పైగా ఎత్తు, 16 అడుగులకు పైగా వెడల్పు, 40 అడుగుల విస్తీర్ణంలో నాలుగు నిర్మాణాలను ఈ పేక ముక్కలతోనే కట్టేశాడు. ఇందుకోసం ఏకంగా 41 గంటలకు పైగా కష్టపడినట్టు ఆ బాలుడు చెప్పాడు. దీంతో గతంలో బ్రయాన్ బెర్గ్ పేరుతో ఉన్న పేక మేడల రికార్డు చెరిగిపోయింది. బ్రయాన్ పేకముక్కలతో మూడు మకావూ హోటళ్ల ప్రతిరూపాలను సృష్టించి రికార్డులకెక్కాడు. తాజాగా బ్రయాన్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన ఈ బాలుడు కోల్ కతాకు చెందిన అర్నవ్ డాగా. పదో తరగతి చదువుతున్న డోగా.. ఓవైపు చదువుపై శ్రద్ధ కోల్పోకుండానే, ఇటు హాబీని కంటిన్యూ చేసుకుంటూ వచ్చానని తెలిపాడు. స్కూలు పాఠాలు చదువుతూ, హోంవర్క్ చేసుకుంటూ ఇటు పేక ముక్కలతో బిల్డింగ్ లు కట్టడం చాలా కష్టమైందని ఆర్నవ్ చెప్పాడు. చిన్నతనం నుంచి పేక ముక్కలతో చిన్న చిన్న మేడలు కడుతూ ఉండేవాడినని చెప్పాడు. గతేడాది కూడా రికార్డు కోసం ప్రయత్నించి విఫలమయ్యానని ఆర్నవ్ వివరించాడు. ఈసారి తన కృషి ఫలించి గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కడం ఆనందంగా ఉందన్నాడు అర్నవ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..