Gaza Girl: నన్ను కాదు మా అమ్మానాన్నలను కాపాడండి.. గాజాలో కన్నీళ్లు పెట్టిస్తున్న బాలిక వీడియో.

|

Dec 11, 2023 | 9:12 AM

తామంతా బ్రతికే ఉన్నామనీ తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, నాన్నమ్మ, తాతయ్యతో పాటు ఏడాది వయసున్న తమ్ముడు కూడా శిథిలాల కింద ఉన్నాడనీ తనను కాదు.. ముందు వాళ్లను బతికించండి ప్లీజ్‌.. వాళ్లను రక్షించిన తర్వాత తనను కాపాడండి.. అంటూ పదమూడేళ్ల వయసున్న బాలిక గాజాలో నేలకూలిన ఐదంతస్తుల భవనం కింద రోదిస్తున్న వీడియో ప్రతివారినీ కదిలిస్తోంది. రెండు నెలలుగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న బాంబుల దాడికి ధ్వంసమైపోతున్న గాజాలో మరో బాధితురాలి కన్నీటి గాథ ఇది..

తామంతా బ్రతికే ఉన్నామనీ తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, నాన్నమ్మ, తాతయ్యతో పాటు ఏడాది వయసున్న తమ్ముడు కూడా శిథిలాల కింద ఉన్నాడనీ తనను కాదు.. ముందు వాళ్లను బతికించండి ప్లీజ్‌.. వాళ్లను రక్షించిన తర్వాత తనను కాపాడండి.. అంటూ పదమూడేళ్ల వయసున్న బాలిక గాజాలో నేలకూలిన ఐదంతస్తుల భవనం కింద రోదిస్తున్న వీడియో ప్రతివారినీ కదిలిస్తోంది. రెండు నెలలుగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న బాంబుల దాడికి ధ్వంసమైపోతున్న గాజాలో మరో బాధితురాలి కన్నీటి గాథ ఇది.. హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో మానవహననానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ ప్రయోగించిన బాంబుల దాడితో స్థానికంగా ఉన్న ఓ ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. రెస్క్యూ టీమ్‌ వచ్చి శిథిలాలను తొలగిస్తుండగా వాళ్లకు ఓ బాలిక ‘ప్లీజ్‌, మమ్మల్ని రక్షించండి..’ అన్న గొంతు వినిపించడంతో అక్కడికి వెళ్లారు. శిథిలాల కింద ఉన్న బాలికతో రెస్క్యూ టీమ్‌ మాట్లాడారు.

అల్మాను బయటకు తీసిన సహాయక బృందాలు.. తన కుటుంబాన్ని కూడా బయటకు తీసుకొస్తామని మాట ఇచ్చాయి. భారీ శిథిలాల కింద నుంచి వచ్చిన అల్మా.. తన కుటంబ సభ్యులు ఎక్కడ ఉన్నారన్న ఆచూకీని వారికి చూపించింది. ఆ బాలిక ముఖం మొత్తం సిమెంట్‌ కప్పి ఉండగా అంత ప్రమాదంలో కూడా ఆ చిన్నారి తన కుటుంబం కోసం తపిస్తున్న వీడియోను ప్రముఖ ఛానెల్‌ అల్‌ జజీరా పోస్ట్‌ చేసింది. అయితే అల్మా కోరినట్టుగా సహాయక బృందాలు తన కుటుంబాన్ని కాపాడారా..? లేదా..? అన్నది మాత్రం తెలియరాలేదు. సుమారు రెండు నెలలుగా పాలస్తీనాపై భీకర పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్‌.. ఉగ్రవాద సంస్థ హమాస్‌ను నామరూపాల్లేకుండా చేయడానికి ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. గాజాపై బాంబుల దాడితో ఆ ప్రాంతాన్ని శవాల దిబ్బగా మారుస్తోంది ఇజ్రాయెల్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.