పొలం గట్టుపై బుసలు కొట్టిన 12 అడుగుల గిరినాగు.. షాకింగ్ వీడియో

|

Jan 03, 2023 | 9:46 AM

ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో తరచుగా కనిపిస్తూ కింగ్‌కోబ్రాలు స్థానికుల్ని హడలెత్తిస్తున్నాయి. కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి కావడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో తరచుగా కనిపిస్తూ కింగ్‌కోబ్రాలు స్థానికుల్ని హడలెత్తిస్తున్నాయి. కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి కావడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాగు జనాలను పరుగులు పెట్టించింది. ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులు.. బుసలు కొడుతున్న కింగ్‌ కోబ్రాను చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌క్యాచర్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇద్దరు స్నేక్‌ క్యాచర్స్‌ గిరినాగును బంధించేందుకు చాలాసేపు శ్రమపడ్డారు. ఎట్టకేలకు ఎంతో చాకచక్యంగా కింగ్‌కోబ్రాను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో రైతులు, స్థానికులు ఊపిరితీసుకున్నారు. వరుసగా కింగ్ కోబ్రాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాఫీ రుచిని ఆస్వాదిస్తూ గన్‌ ఫైరింగ్.. సైనికుడి వీడియో వైరల్

మొండిగా ‘మగధీర’ సినిమాను కొన్నా.. కానీ ఆ తరువాతే !!

Aamir Khanఎన్టీఆర్ సినిమాలో అమీర్‌ ఖాన్ కీ రోల్‌ !!

Dil Raju: మహేష్‌తో గొడవపై దిల్ రాజు కామెంట్.. ఏమన్నారంటే ??

Karthi: WWE రింగులో హీరో కార్తీ.. ఎందుకంటే ??

 

Published on: Jan 03, 2023 09:46 AM