సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన జంట.. రాత్రికి రాత్రే

Updated on: Jun 13, 2025 | 5:50 PM

ఓ వ్యక్తి సాయత్రం సరదాగా భార్యతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ దారిలో అలవాటు ప్రకారం ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు. అదే అతన్ని రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని చేసేసింది. అంతే.. అదృష్టం ఏ టైమ్‌లో ఎలా మనవెంట వస్తుందో తెలీదు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. కేవలం 3 డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు 257 రూపాయలు పెట్టి కొన్న టికెట్‌కు ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.12.86 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

దీంతో ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ జంట భోజనం కోసం ఓ రెస్టారెంట్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో సరదాగా ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి, టికెట్ కొనే విషయంలో వారిద్దరి మధ్య కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిసింది. ఒకరు ఇక్కడే కొందామంటే, మరొకరు వేరే చోట చూద్దామనుకున్నారు. చివరకు, ఓసారి ప్రయత్నించి చూద్దామని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి టికెట్ కొని స్క్రాచ్ చేశారు. అంతే, భారీ మొత్తంలో లాటరీ తగలడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యపోతూ ఆ జంట.. ఇది నిజంగా నమ్మశక్యం కాని అదృష్టం. ఈ గెలుపు మా జీవితాలనే మార్చేసింది. గతంలో బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేవాళ్లం. ఇప్పుడు ఈ లాటరీ డబ్బుతో మా జీవితం ఎలాంటి ఆందోళన లేకుండా సాఫీగా సాగిపోతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ లాటరీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా, ఏటా కొంత మొత్తం చొప్పున 25 సంవత్సరాల పాటు విత్‌డ్రా చేసుకునేలా లాటరీ నిర్వాహకులతో వారు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో వారి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విధి లిఖితం అంటే ఇదే కావచ్చు! ఒక్క రోజు తేడాతో ఈ స్టార్ హీరోల ఇళ్లలో తీవ్ర విషాదం

కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..

చేసిన రచ్చ ఫలితం.. కల్పిక పై పోలీస్‌ కేస్‌

కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్

సాయంత్రం చిరుతిండికి బ‌దులు వీటిని తింటే.. ఎన్నో లాభాలు