Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయంత్రం చిరుతిండికి బ‌దులు వీటిని తింటే.. ఎన్నో లాభాలు

సాయంత్రం చిరుతిండికి బ‌దులు వీటిని తింటే.. ఎన్నో లాభాలు

Phani CH
|

Updated on: Jun 13, 2025 | 5:10 PM

Share

సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏం చిరు తిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది అనారోగ్యక‌ర‌మైన ఆహారాల‌నే స్నాక్స్ రూపంలో తింటున్నారు. దీంతో వ్యాధుల‌ను కొని తెచ్చుకుంటున్నారు. అయితే సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్యక‌ర‌మైన ఆహారాల‌ను తింటే దాంతో పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ క‌ల‌గ‌డ‌మే కాదు, పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.

అలాగే వ్యాధుల‌ను తగ్గించుకోవ‌చ్చు. ఇక అలాంటి స్నాక్స్‌లో అంజీర్ ఒక‌టి. ఇవి పండ్లుగా, డ్రై ఫ్రూట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అయితే పండ్లు ల‌భించాలంటే కేవ‌లం సీజ‌న్‌లోనే వ‌స్తాయి. కానీ అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను మ‌నం ఎప్పుడైనా కొన‌వ‌చ్చు. అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను 3 లేదా 4 తీసుకుని ఉద‌యం నీటిలో నాన‌బెట్టాలి. సాయంత్రం స‌మ‌యంలో వీటిని స్నాక్స్‌లా తినాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అంజీర్ పళ్లలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవ‌స్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంజీర్ ప్రీ బ‌యోటిక్ ఆహారంగా కూడా ప‌నిచేస్తాయి. అంటే వీటిని తింటే జీర్ణ వ్యవ‌స్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా రాత్రి పూట ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. అంజీర్ పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. పొటాషియం కూడా అధిక మొత్తంలో ల‌భిస్తుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. మెగ్నిషియం కూడా అధికంగానే పొంద‌వ‌చ్చు. ఇది మన శ‌రీరంలో 300కు పైగా జీవ ర‌సాయ‌నిక చ‌ర్యల‌ను ప్రేరేపిస్తుంది. దీంతో కండ‌రాలు, నాడులు ఆరోగ్యంగా ఉంటాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్రణ‌లో ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది. అంజీర్ పండ్లలో ఉండే ఐర‌న్ ర‌క్తం త‌యార‌య్యేలా చేస్తుంది. ర‌క్తహీన‌త‌ను త‌గ్గిస్తుంది. శ‌రీరంలోని క‌ణాల‌కు ఆక్సిజన్ ఎక్కువ‌గా అందేలా చూస్తుంది. దీంతో నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి క్రిముల‌ను అడ్డుకుంటుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అంజీర్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం తగ్గుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఇలా అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెత్త మధ్యన ఉన్నది ఏదో సాధారణ శిల్పం అనుకుంటే పొరపాటే

Published on: Jun 13, 2025 04:51 PM