పెళ్లి కుమార్తెను వీడియో తీసి కెమెరామెన్‌ సహా అంతా షాక్‌ వీడియో

Updated on: Jun 04, 2025 | 6:24 PM

ఆధునిక కాలంలో పెళ్లి చేసుకోవడం అంటే సినిమా షూటింగ్‌ను తలపిస్తుంది. వివాహ నిశ్చయతాంబూలాల నుంచి పెళ్లి జరిగి కుటుంబ కూడలి అత్తారింటిలో అడుగుపెట్టేవరకు ప్రతిదీ ఫోటోలు, వీడియోల రూపంలో రికార్డ్ చేస్తుంటారు. ఫోటో షూట్స్ పేరుతో నూతన జంటను సినిమా తరహా స్టిల్స్ తీయడం, డాన్స్ చేయించడం, పెళ్లి మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వడం, ఇలా ప్రతి దశాన్ని ఎంతో అందంగా, వినూత్నంగా ఉండేలా డైరెక్షన్ స్క్రీన్ ప్లే చేసుకుంటూ రికార్డ్ చేస్తుంటారు. మరికొందరు కెమెరామెన్లు చిత్రవిచిత్రంగా వీడియోలు తీయడం కూడా చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పెళ్లిలో సడన్ గా జరిగిన హటాత్ పరిణామానికి అంతా నవ్వుకుంటున్నారు. అందంగా తయారైన పెళ్లి కూతురు పెళ్లి మండపంలోకి అంతే అందంగా నడుచుకుంటూ వస్తుంది. ఆ సమయంలో ఆమె చుట్టూ నిలబడ్డవారు రంగురంగుల దుపట్టాను వధువుకు నీడగా పట్టుకొని వస్తుంటారు. ఆ సీన్‌ను కెమెరామెన్ తన టాలెంట్‌ను ఉపయోగించి వినూత్నంగా వీడియో తీసేందుకు వెనక్కి నడుస్తూ ఉంటాడు. అయితే అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సడన్‌గా ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. షూటింగ్‌లో లీనమైపోయిన కెమెరామెన్ అలా వెనక్కి వెళుతూ వీడియో తీస్తుండగా కాళ్లకు చెత్త డబ్బా తగులుకొని పెద్ద సౌండ్ తో కిందపడిపోయాడు. ఈ ఘటనతో పెళ్లి కూతురుతో పాటు ఆమె స్నేహితులు, బంధువులంతా అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకొని తగ్గలబడి నవ్వుకున్నారు. వీడియోగ్రాఫర్‌ను అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఈమెలా పెళ్లి చేసుకోండి ..హలో బాయ్స్‌ .. గర్ల్స్ వీడియో

ఆరేళ్ల చిన్నారికి జీవితాన్నిచ్చిన వైద్యులు..ఏం జరిగిందంటే వీడియో

రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు..ఆశ్యర్యపోయే ప్రయోజనాలు వీడియో