AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని

అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని

Phani CH
|

Updated on: Feb 07, 2026 | 6:33 PM

Share

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ మున్సిపల్ అధికారి 'వన్ బై త్రీ' కాఫీ ఇవ్వలేదని ఆగ్రహించి, హోటల్ ర్యాంపును జేసీబీతో కూల్చేందుకు యత్నించారు. హోటల్ యజమాని నిరసన తెలపగా, స్థానికుల మద్దతుతో అధికారి వెనక్కి తగ్గారు. ఈ ఘటన అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలిచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, నెటిజన్ల తీవ్ర విమర్శలకు దారితీసింది.

కడప జిల్లా ప్రొద్దుటూరులో.. ఒక చిన్న కాఫీ విషయంలో తలెత్తిన వివాదం మున్సిపల్ అధికారి ఆగ్రహానికి కారణమైంది. పంతానికి పోయిన సదరు అధికారి, ఏకంగా జేసీబీతో హోటల్ ముందున్న ర్యాంపును కూల్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 4వ తేదీన ప్రొద్దుటూరులోని ఒక టీ షాపు వద్దకు ఓ మున్సిపల్ అధికారి తన అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ వారు ‘వన్ బై త్రీ’ కాఫీ ఇవ్వమని అడిగారు. హోటల్ సిబ్బంది అలా ఇవ్వడం కుదరదని, తమవద్ద అలాంటి పద్ధతి లేదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన అధికారి, హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు. అంతా సద్దుమణిగింది అనుకునేలోపు మళ్లీ వచ్చాడు ఆ అధికారి. ఆగ్రహంతో వెళ్లిపోయిన అతను అరగంటలో ప్రోక్లైన్ తో తిరిగి వచ్చి, మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి డ్రైనేజీపై ర్యాంప్ కట్టారంటూ కూల్చివేతకు పూనుకున్నారు. దీంతో ఖంగుతిన్న హోటల్ యజమాని, అధికారుల తీరును నిరసిస్తూ నేరుగా జేసీబీ టైర్ల కిందే పడుకుని అడ్డుకున్నారు. పట్టణమంతా డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు ఉన్నా పట్టించుకోని అధికారులు, కేవలం కాఫీ ఇవ్వలేదన్న కక్షతోనే తన షాపుపై పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యజమాని పట్టుదలకు తోడు స్థానికులు కూడా అధికారులను నిలదీయడంతో, చేసేదేమీ లేక మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. ఈ తతంగమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చిన్న కారణానికి అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నర్సింగ్‌ స్టూడెంట్‌ సూసైడ్‌.. అసలు కారణం ఇదే

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు తీసుకున్నముద్దాడ రవిచంద్ర

చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే

మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్.. షాక్ లో అభిమానులు