Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ దోపిడీ

Updated on: Dec 17, 2025 | 1:00 PM

విజయవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. గంటల లెక్కన వసూలు చేస్తున్న అధిక చార్జీలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలవారీ పాసులు నిరాకరిస్తూ, పార్కింగ్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ఫీజులు తగ్గించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

విజయవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ ఫీజులు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజుకు 2లక్షలమంది రాకపోకలు సాగించే అతి పెద్ద రైల్వే స్టేషన్‌లో టూ వీలర్లు, ఫోర్‌ వీలర్లు పార్కింగ్‌ చేయాలంటే వాహనదారులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్లో ఊరు వెళ్లి వచ్చే చార్జీల కంటే, పార్కింగ్‌ చార్జీలు ఎక్కువైపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రీమియం పార్కింగ్‌ పేరుతో గంటగంటకు చార్జీల బాదుడు పెరిగిపోతోంది. ఉద్యోగం కోసం డైలీ వేరే ప్రాంతాలకు వెళ్లేవాళ్లకు, ఈ పార్కింగ్‌ చార్జీల భారం తడిసి మోపెడవుతోంది. ఒకవైపు.. రైల్వే అధికారులు యునిక్ పాలసీ ప్రకారం టెండర్లు పిలుస్తున్నామని చెబుతుండగా, వాహనాలు పార్కింగ్ చేసే ప్రయాణికుల జేబులకు మాత్రం భారీగా చిల్లు పడుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో గంటపాటు టూ వీలర్‌ పార్కింగ్ చేస్తే రూ. 12 చార్జీ వసూలు చేస్తున్నారు. 12 గంటలకు 144 రూపాయల పార్కింగ్‌ ఫీజు తీసుకుంటున్నారు. 24 గంటలకు 288 రూపాయల చార్జీ అని చెబుతున్నారు. ఫోర్‌ వీలర్‌కు అయితే గంటకు రూ. 50 పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు రూ. 50 చొప్పున వడ్డిస్తున్నారు. 12 గంటలకు రూ. 400 నుంచి 500 తీసుకుంటున్నారు. 24 గంటలకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. GSTతో కలిపి వడ్డిస్తూ ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్నారు. పార్కింగ్‌ బాదుడు మరీ ఎక్కువైపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. పార్కింగ్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైల్వేశాఖ నిబంధనల ప్రకారం పార్కింగ్ నిర్వాహకులు ఖచ్చితంగా నెలవారీ పాసులు ఇవ్వాలి. ఈ పాసుల కోసం ఎవరైనా ప్రయాణికులు అడిగితే, పాసులు పరిమితంగా ఉన్నాయని, అందరికి ఇవ్వడం సాధ్యం కాదని చెబుతూ, పార్కింగ్‌ దోపిడీ కొనసాగిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పార్కింగ్‌ దోపిడీపై ప్రయాణికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా రైల్వే ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిశీలించి.. పార్కింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దోపిడీని అడ్డుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి

Pawan Kalyan: పవన్‌ డ్యాన్స్‌ ఎఫెక్ట్‌ షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Akhanda 2: అఖండ2 థియేటర్లో అఘోరాలు.. వైరల్‌గా వీడియో..

Top9 ET News: సుజీత్‌కు పవర్ స్టార్ రెండున్నర కోట్ల కానుక

సీన్‌ రివర్స్‌… ఓటింగ్ ఫలితాల్లో భారీ తేడా

Published on: Dec 17, 2025 01:00 PM