Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్‌’ రైళ్లు.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

|

Nov 09, 2023 | 8:49 PM

‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. భారతీయ రైల్వే నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న రైలు ముంబయి నుంచి బయలుదేరి ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్‌ చేరుకుందని అధికారులు ప్రకటించారు. ఈ ట్రయల్‌ రన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. రైల్వే ప్రయాణికులు దానిని ఆసక్తిగా తిలకించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌ బోగీలతో కూడిన వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి.

‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. భారతీయ రైల్వే నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న రైలు ముంబయి నుంచి బయలుదేరి ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్‌ చేరుకుందని అధికారులు ప్రకటించారు. ఈ ట్రయల్‌ రన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. రైల్వే ప్రయాణికులు దానిని ఆసక్తిగా తిలకించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌ బోగీలతో కూడిన వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. వాటి తరహాలోనే ‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’లను రూపొందించారు. కాకపోతే ఇవి పూర్తిగా నాన్‌ ఏసీ బోగీలను కలిగి ఉంటాయి. మొత్తం 22 కోచ్‌లతో కూడిన ఈ నూతన రైళ్లలో స్లీపర్‌, జనరల్‌ క్లాసులు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వీటిలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. పొంచి ఉన్న ప్రమాదాల గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు​

పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి !!

Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం

చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్‌ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు