AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌పై దాడులకుమా బేస్‌ వాడొద్దు ట్రంప్‌కు షాకిచ్చిన యూకే

ఇరాన్‌పై దాడులకుమా బేస్‌ వాడొద్దు ట్రంప్‌కు షాకిచ్చిన యూకే

Phani CH
|

Updated on: Feb 23, 2026 | 5:00 PM

Share

మధ్యప్రాచ్యంలో దాడులకు అమెరికాకు తన స్థావరాలను (డీగో గార్సియా, ఫెయిర్‌ఫోర్డ్) ఉపయోగించడానికి అనుమతిని యూకే తిరస్కరించింది. ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న ట్రంప్‌ ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్‌. మిత్రదేశం చేసే చట్టవిరుద్ధ దాడులకు సహకరించకూడదనే బ్రిటన్ నూతన విధానం ఈ నిర్ణయానికి కారణం. అణు ఒప్పందంపై ఇరాన్‌తో చర్చలు విఫలమైతే దాడులు చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ పరిణామం అమెరికా-యూకే సంబంధాలపై ప్రభావం చూపుతుంది.

మధ్యప్రాచ్య ప్రాంతంలో దాడులు చేయడానికి అమెరికా గతంలో fair ford బేస్‌ను హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియాను ఉపయోగించింది. ప్రస్తుతం మరోసారి ఆ రెండు స్థావరాల నుంచి దాడులు చేయడానికి యూకేను అనుమతి కోరింది. ట్రంప్‌ కు షాకిస్తూ తమ బేస్‌లను ఉపయోగించవద్దని కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2001 తర్వాత యూకే విధానంలో పలు మార్పులు జరిగాయి. ఒక మిత్రదేశం చేసే చట్టవిరుద్ధ దాడికి సహకరిస్తే బ్రిటన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే ముందస్తు దాడులకు మద్దతు ఇవ్వడంలో బ్రిటన్‌ జాగ్రత్తగా ఉంది. ఇంతకుముందు కూడా అమెరికా ఇరాన్‌పై చేసిన దాడుల్లో నేరుగా పాల్గొనలేదు. కేవలం రక్షణ చర్యల్లో మాత్రమే సహకరించింది. అణు ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్‌పై దాడులకు తమ దేశంలోని రెండు కీలక స్థావరాలను వాడొద్దని యూకే అమెరికాకి తేల్చి చెప్పింది. దీంతో స్విండన్‌ సమీపంలోని ఫెయిర్‌ ఫోర్డ్‌ బేస్‌ నుంచి లాంగ్‌రేంజ్‌ బాంబింగ్‌ ఆపరేషన్లు నిర్వహించడానికి అగ్రరాజ్యానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే డీగో గార్సియా బేస్‌ను మారిషస్‌కు తిరిగి అప్పజెప్పాలన్న యూకే నిర్ణయంపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో తాజాగా యూకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపాలని కొంతకాలంగా అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తెస్తోంది. ఆ విషయంలో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడులు చేస్తామని బెదిరించింది. ఇందుకోసం అనేక యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక దళాలను ఇరాన్‌ వైపు తరలిస్తోంది. ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై అగ్రరాజ్యం విరుచుకుపడే అవకాశం ఉంది. తాజాగా ఇరాన్‌తో చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. మరో 10 రోజుల్లో అణు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే యూకే విదేశీ భూభాగమైన డీగో గార్సియా, ఫెయిర్‌ ఫోర్డ్‌ బేస్‌ల మీదుగా టెహ్రాన్‌పై దాడులు చేస్తామన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్యా “కాంట్రాక్ట్ కిల్లింగ్‌’ వ్యూహం.. ఉక్రెయిన్‌కు పట్టుబడ్డ కిరాయి హంతకులు

స్పీడ్ రేసింగ్‌లో నాగచైతన్య.. టీమ్ కోసం రంగంలోకి అక్కినేని వారసుడు

Follow Us