ఇక.. విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు.. గ్లోబల్ గుర్తింపు దిశగా టీటీడీ అడుగులు

Updated on: Dec 24, 2025 | 1:51 PM

టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బృహత్తర ప్రణాళికను రూపొందించింది. సీఎం చంద్రబాబు సూచనలతో, శ్రీవారి ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలకమండలి కసరత్తు చేస్తోంది. నిపుణుల కమిటీ చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసింది. త్వరలోనే వివిధ దేశాల్లో శ్రీనివాసుడి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. విదేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా, తిరుమల తరహాలో ఆగమశాస్త్ర పూజలతో ఆలయాలను నిర్మిస్తారు.

శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు టీటీడీ బృహత్తర ప్రణాళికను రూపొందించింది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు, ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలకమండలి కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించి, విదేశాల్లో ఆలయాల నిర్మాణం, నిర్వహణకు చట్టపరమైన అంశాలపై లోతైన అధ్యయనం చేయించింది. ఈ కమిటీ ప్రతిపాదనలపై టీటీడీ పలుమార్లు చర్చించింది. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణతో వివిధ దేశాల్లో శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి విదేశాల నుంచి టీటీడీకి భారీగా విజ్ఞప్తులు అందుతున్నాయి. ఇప్పటికే యూకే నుంచి 4, జర్మనీ నుంచి 3 ప్రతిపాదనలు రాగా, ఆస్ట్రేలియా, శ్రీలంక, నెదర్లాండ్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, పోలండ్, ఐర్లండ్, న్యూజిలాండ్‌ తదితర దేశాల నుంచి కూడా అభ్యర్థనలు వచ్చాయి. విదేశాల్లో శ్రీవారి ఆలయాలను ఎలా నిర్వహించాలన్న అంశంపై టీటీడీ పలు నమూనాలు పరిశీలిస్తోంది. విదేశాల్లో నిర్మించే ఆలయాల్లోనూ తిరుమల తరహాలోనే ఆగమశాస్త్ర ప్రకారం పూజలు జరిగేలా టీటీడీ నుంచి అర్చకులను పంపిస్తారు. భారతదేశం నుంచి ప్రత్యేకంగా శిల్పులను పంపించి, మన సంప్రదాయం ఉట్టిపడేలా ఆలయాలు నిర్మిస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా టీటీడీ పేరును ట్రేడ్‌మార్క్‌ చేయాలని పాలకమండలి నిర్ణయించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా

పంచెకట్టులో బౌండరీ షాట్స్‌.. పురోహితుల క్రికెట్‌ టోర్నమెంట్‌ అదుర్స్‌

చిన్నారి ఫ్యాన్ కు స్మృతి మంధాన రిప్లై టీ20ల్లో రికార్డు

వాట్సప్ యూజర్స్… బీ అలర్ట్… ఘోస్ట్‌ పెయిరింగ్‌‌కు చెక్ పెట్టండిలా

Dhurandhar: ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి! పాకిస్తానీల వింత డిమాండ్