TTD on Hinduism: హిందూ మతంలో చేరే వారి కోసం తిరుమలలో ప్రత్యేక వేదిక.!
తిరుమలలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్థాన మండపంలో 3 రోజులు పాటు జరిగిన ఈ ధార్మిక సదస్సు సోమవారంతో ముగిసింది. సదస్సులో స్వామీజీలు చేసిన సూచనలు, సలహాలపై పలు తీర్మానాలు చేశారు. సదస్సు ముగింపు తర్వాత TTD చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ వివరాల్ని మీడియాకు వెల్లడించారు. మొత్తం 19 కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు భూమన తెలిపారు.
తిరుమలలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్థాన మండపంలో 3 రోజులు పాటు జరిగిన ఈ ధార్మిక సదస్సు సోమవారంతో ముగిసింది. సదస్సులో స్వామీజీలు చేసిన సూచనలు, సలహాలపై పలు తీర్మానాలు చేశారు. సదస్సు ముగింపు తర్వాత TTD చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ వివరాల్ని మీడియాకు వెల్లడించారు. మొత్తం 19 కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు భూమన తెలిపారు. 62 మంది పీఠాధిపతులు ఈ సదస్సులో పాల్గొన్నారని వివరించారు. హిందూ మతంలో చేరాలనుకునేవారికి పవిత్ర జల సంప్రోక్షణ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు భూమన తెలిపారు. అన్య మతస్తులు ఎవరైనా హిందూ మతంలో చేరాలని ఆసక్తి చూపితే, వారి కోసం తిరుమలలో ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వేదిక లేదని తెలిపారు. హిందూ మతంలో చేరాలనుకుని వచ్చే వారికి ఈ వేదిక ద్వారా పవిత్ర జల ప్రోక్షణంతో స్వాగతిస్తారని వివరించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ హిందూ ధార్మిక కార్యక్రమాల ప్రచారం చేపడతామని, స్కూల్ విద్యార్థులకు కూడా హైందవ ధర్మం విశిష్టత, ఆవశ్యకత తెలియజేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని భూమన వెల్లడించారు. తిరుమల స్థాయిలో తిరుపతి నగరాన్ని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. యువతలో ధార్మిక భావనలు పెంపొందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..