TTD Good News: తిరుమల కాలి నడక భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. దివ్య దర్శనం పునరుద్ధరణ.

|

Jun 23, 2024 | 5:55 PM

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల పునరుద్ధరించినట్టు వెల్లడించారు అధికారులు. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ జరిపారు. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద కౌంటర్ లో తప్పనిసరిగా టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన విధించారు. లేనిపక్షంలో స్వామివారి దర్శనానికి అనుమతించమని టీటీడీ ప్రకటించింది.

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల పునరుద్ధరించినట్టు వెల్లడించారు అధికారులు. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ జరిపారు. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద కౌంటర్ లో తప్పనిసరిగా టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన విధించారు. లేనిపక్షంలో స్వామివారి దర్శనానికి అనుమతించమని టీటీడీ ప్రకటించింది. గతంలో శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకొని భక్తులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి. దీనిని ఆసరాగా తీసుకుని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ ఈఓ శ్యామల రావు, పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకు 2500 టోకెన్లతో ట్రైల్ రన్ చేస్తామని వెల్లడించారు. త్వరలో 6వేల టోకెన్లకు పెంచనున్నట్టు సమాచారం. తాజా నిర్ణయంతో దళారులకు చెక్ పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on