ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతానికి సద్దుమణుగుతున్నాయి. గల్ఫ్ దేశాల దౌత్యం, ఇరాన్లో నిరసనలు తగ్గడం వంటి పరిణామాలతో ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. వెనిజులా విషయంలో దూకుడు చూపిన ట్రంప్, ఇరాన్ పట్ల మాత్రం వెనక్కి తగ్గడం గమనార్హం
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి తొలగిపోయాయి. ఏ క్షణమైనా సైనిక దాడి తప్పదనుకున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇరాన్లో అంతర్గతంగా జరుగుతున్న నిరసనలు తగ్గడం, అలాగే గల్ఫ్ దేశాల దౌత్యం ట్రంప్ వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అమెరికా దాడికి సిద్ధపడగా, ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, ఈజిప్ట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకుని ట్రంప్‌ను తమ నిర్ణయంపై పునరాలోచించమని కోరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ స్థిరత్వంపై యుద్ధ ప్రభావం ఉంటుందని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మరిన్ని వీడియోల కోసం :
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
వైరల్ వీడియోలు
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?

