మా విశ్రాంతి మాటేంటి ?? ప్రశ్నిస్తున్న లోకోపైలట్లు

Updated on: Dec 13, 2025 | 1:46 PM

ఇండిగో సంక్షోభంలాగే, లోకో పైలట్లు విశ్రాంతి, డ్యూటీ గంటల సంస్కరణలు డిమాండ్ చేస్తున్నారు. 14-23 గంటల డ్యూటీలు అలసట పెంచి, లక్షల మంది ప్రయాణీకుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. యూరోప్‌లో కఠిన నియమాలు ఉండగా, భారతదేశంలో రైల్వే పైలట్లకు అలాంటి రక్షణ లేదు. ఫటీగ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేయాలని, ఇది రైల్వే భద్రతకు అత్యవసరం అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇండిగో సంక్షోభం ఎంతటి గందరగోళానికి దారి తీసిందో చూసాం. పైలట్లకు విశ్రాంతి రూల్స్‌ అమల్లోకి రావడంతో సడెన్‌గా కొరత ఏర్పడటం వేలాదిగా విమాన సర్వీసులు ఆగిపోవడం చివరకు తాత్కాలికంగా ఆ రూల్స్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవడం జరిగింది. మా విశ్రాంతి మాటేంటి? అంటూ లోకోపైలట్లు డిమాండ్‌ చేస్తున్నారు. తమకూ విశ్రాంతి అవసరమనే గళం వినిపించడం మొదలుపెట్టారు లొకో పైలట్లు. కోట్లాది ప్రయాణికుల భద్రతే ముఖ్యమని అంటున్నారు. ట్రైన్ డ్రైవర్లుగా 14 నుంచి 23 గంటలు నిరంతరంగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక డ్యూటీలు అలసటను పెంచి, ఏకాగ్రతను తగ్గిస్తాయనీ, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల లక్షల మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనీ అంటున్నారు. అందుకే ఫటీగ్‌ రిస్క్‌ మానేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఆధారంగా డ్యూటీ అవర్స్ అమలు చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, రైళ్లను నడిపే పైలట్లపై ఒత్తిడి తగ్గడం లేదు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో కఠిన డ్యూటీ అవర్స్‌పై పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం రైల్వేలో అలాంటివేం లేవు. ఈ సమస్య రైల్వేలోనూ ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతోందని All India Loco Running Staff Association చెబుతోంది. రోజుకి 6 గంటలకు డ్యూటీ, ప్రతి డ్యూటీ తర్వాత 16 గంటల విశ్రాంతి. వారానికి ఒక కంపల్సరీ రెస్ట్‌, ఈ డిమాండ్‌లను 1970 నుంచే ఈ సంఘం వినిపిస్తోంది. 2024 అక్టోబర్‌లో దేశవ్యాప్త నిరసన కూడా నిర్వహించారు. లొకో పైలట్ల ఆందోళనలు ప్రజల భద్రతకు సంబంధించిన హెచ్చరికగా భావించాలి. రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే కొత్త నియమాలు, విశ్రాంతి విధానాలు అమలు చేయకపోతే, రైళ్ల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి

ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి

అరబ్ దేశాలకు చైనా ఊహించని షాక్‌.. సముద్రపు నీటితో ఫ్యూయల్‌ తయారీ

పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..

అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..