అల్లూరి జిల్లా అరకుకు పోటెత్తిన పర్యాటకులు, వాహనాలతో నిండిపోయిన రోడ్లు
అల్లూరి జిల్లా అరకు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. వాహనాలతో రోడ్లు నిండిపోయాయి, హోటళ్లు నిండుగా ఉన్నాయి. రద్దీ దృష్ట్యా సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ముందుస్తు సమాచారం లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. అల్లూరి జిల్లాలోని అరకు పర్యాటక ప్రాంతం ఇయర్ ఎండ్‌లో పర్యాటకులతో కిటకిటలాడుతోంది.
అల్లూరి జిల్లాలోని అరకు పర్యాటక ప్రాంతం ఇయర్ ఎండ్‌లో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. పర్యాటకుల భారీగా పోటెత్తడంతో అరకులోని రోడ్లు వాహనాలతో నిండిపోయి, జాతరను తలపిస్తున్నాయి. పర్యాటకుల రద్దీ కారణంగా హోటళ్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. వసతి దొరకక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించేందుకు అధికారులు పలు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం పూట సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జిని మూసివేశారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా బ్రిడ్జిని మూసివేయడం పట్ల పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్
Jailer 02: జైలర్ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్
