Nagarjunasagar: సాగర్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ

Updated on: Aug 24, 2025 | 1:25 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో నగరానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. భారీ వర్షాలతో సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో అక్కడి అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అక్కడి అందాలను సెల్ ఫోన్లు, కెమెరాలలో బంధిస్తున్నారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో నాగార్జునసాగర్‌కి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. భారీ వర్షాలతో కొద్దిరోజులుగా నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో.. సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. నాగార్జునసాగర్‌లో పర్యాటకులు తాకిడి పెరిగింది.  సాగర్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్‌తోపాటు.. పుష్కర ఘాట్, బుద్ధవనం లాంటి ప్రాంతాలు కూడా పర్యాటకులతో నిండిపోయాయి. సాగర్‌కు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. శివాలయం రోడ్డు, కొత్త బ్రిడ్జిపై భారీగా వాహనాలు బారులుదీరాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..