TOP 9 ET: వెకేషన్లోనూ.. తప్పని తిప్పలు..! ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. | సియా రామ్’ అద్భుతం..
సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం పై ఆమె తండ్రి స్పందించారు. కీర్తి తన ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అబ్బాయి కీర్తికే కాదు మాకు కూడా తెలుసు. తన పేరు ఫర్హాన్. వాళ్లు స్నేహితులు మాత్రమే. కీర్తికి పెళ్లి కుదిరితే..
01.BRO
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా బ్రో. ఇప్పటికే ఈ చిత్రంలో పవన్ పార్ట్ పూర్తైపోయింది. అయితే పవన్ కళ్యాణ్ పోర్షన్ పూర్తైనా.. సాయి ధరమ్ తేజ్ షూటింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. గత వారం నుంచి చిత్ర సెట్స్‌లో చేరారు సాయి తేజ్. కాగా సినిమాలోంచి ఈయన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పవన్, సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫోటోను విడుదల చేసారు మేకర్స్. సినిమా జులై 28న విడుదల కానుంది.
02.V Mega
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ది ఇండియా హౌస్. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. స్వతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు మేకర్స్.
03. Keerthy Suresh
సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం పై ఆమె తండ్రి స్పందించారు. కీర్తి తన ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అబ్బాయి కీర్తికే కాదు మాకు కూడా తెలుసు. తన పేరు ఫర్హాన్. వాళ్లు స్నేహితులు మాత్రమే. కీర్తికి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు మేమే చెబుతాం’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలపై కీర్తి కూడా ఘాటుగానే స్పందించారు. ఈ సారి నా ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి లాగారా అంటూ సెటైర్ వేశారు కీర్తి.
04. 2018
మలయాళ సర్వైవల్ డ్రామా 2018 రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. మే 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే కేరళలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. మరోవైపు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 2.2 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ 4.48 కోట్లకు పైగానే ఉంది. వీక్ డేస్‌లోనూ అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.
05.Hanu – man
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా హను మాన్. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈసినిమా టీజర్‌ని, ట్రైలర్‌ని ఒకే సారి కట్ చేశామని అన్నారు డైరక్టర్ ప్రశాంత్ వర్మ. టీజర్ విడుదలైన తర్వాత సినిమా కంటెంట్ మీద అంచనాలు పెరిగాయని, వాటిని అందుకోవడం కోసమే ఇంకొంత మెటీరియల్‌ని యాడ్ చేసి ట్రైలర్ రిలీజ్ చేశామని చెప్పారు. టైమ్ ఇస్తే వీఎఫ్‌ఎక్స్ చాలా బాగా వస్తాయని చెప్పారు.
06.shakunthalam
కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శాకుంతలం సినిమా సత్తా చాటింది. నాలుగు అవార్డులను దక్కించుకుంది. సమంత నటించిన సినిమా శాకుంతలం. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు సమంత. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌కుగానూ అవార్డులు దక్కించుకుంది శాకుంతలం చిత్రం.
07. NTR
తన కుటుంబంతో.. చిన్న వెకేషన్‌కు వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటి వరకు కొరటాల శివ దేవర సినిమాతో బిజీగా ఉన్న ఈయన.. తాజాగా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లారు. ఇది ఎక్కువ రోజులు ఉండదని.. కొన్ని రోజుల్లోనే మళ్లీ తారక్ తిరిగి వస్తాడని చెప్తున్నారు ఆయన పిఆర్ టీం. ఇక వచ్చీ రాగానే మళ్లీ దేవర షూటింగ్‌నే పరిగెత్తించనున్నారట యంగ్ టైగర్.
08. NTR
వెకేషన్‌లోనూ.. ఎన్టీఆర్ కు తిప్పలు తప్పడం లేదు. సినిమా అంటే ఎంతో డెడికేటెడ్ గా ఉండే యంగ్ టైగర్ .. దేవర హూటింగ్లో కోసం వెకేషన్లో కూడా జిమ్ చేస్తూ కష్టపడుతున్నారు. బల్కీగా మజిల్ బిల్డ్ చేసేందుకు పర్సనల్ ట్రైనర్‌తో పాటు పాట్లు పడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
09.Adipurush
ఆదిపురుష్ మరో సారి సోషల్ మీడియాలో అద్భుతంగా కీర్తించబడుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన రామ్ సియా రామ్ సాంగ్… వీనుల విందుగా ఉండడంతో.. పాటు.. విజువల్ గా అద్భుతం అనే టాక్ వచ్చేలా చేసుకుంది. రఘురాముడి.. జానకి మధ్య ఉన్న బంధాన్ని సరికొత్తగా చూపిస్తున్న ఈ సాంగ్ అటు యూట్యూబ్‌లోనూ.. రికార్డ్ లెవల్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.