AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేటైంది కానీ.. లేటెస్ట్‌గా స్పీడ్ అందుకున్నారుగా..!

లేటైంది కానీ.. లేటెస్ట్‌గా స్పీడ్ అందుకున్నారుగా..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 28, 2026 | 7:52 PM

Share

కొంతకాలంగా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న సుమంత్, నారా రోహిత్, అల్లరి నరేష్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ‘న్యూటన్స్ థర్డ్ లా’, ‘మహేంద్రగిరి వారాహి’, ‘కపాలి’, ‘సౌండ్ ఇంజనీర్’, ‘రంభ ఊర్వశి మేనక’, ‘ఆల్కహాల్’ వంటి చిత్రాలపై ఆసక్తి నెలకొంది.

నిదానమే ప్రధానం అంటుంటారు కానీ ఒక్కోసారి ఆలస్యం అమృతం విషం కూడా..! ఈ రెండు సామెతలు ఇప్పుడు తెలుగులో కొందరు హీరోలకు బాగా సెట్ అవుతాయి. చాలా కాలంగా నిదానమే ప్రధానం అన్నట్లుగానే ఉన్న వాళ్లు.. ఇప్పుడేమో లేడికి లేచిందే పరుగు అన్నట్లు సడన్‌గా వరస సినిమాలు చేస్తున్నారు. తాము కూడా ఉన్నామని గుర్తు చేసే పనిలో బిజీ అయ్యారు. మరి వాళ్లెవరో చూద్దామా..? సుమంత్.. అక్కినేని అభిమానులకే కాదు అందరికీ ఈ పేరు సుపరిచితమే. పాతికేళ్ల కెరీర్‌లో చాలా మంచి సినిమాలు చేసినా.. స్టార్ డమ్ మాత్రం రాలేదు. కొన్నేళ్లలో మళ్లీ రావా, అనగనగా లాంటి మంచి సినిమాలతో నేనున్నా అంటూ గుర్తు చేసారు సుమంత్. తాజాగా న్యూటన్స్ థర్డ్ లా, మహేంద్రగిరి వారాహి లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారీయన. కమర్షియాలిటీ పక్కనబెట్టి కాన్సెప్టులు పట్టుకుంటున్నారు సుమంత్. న్యూటన్స్ థర్డ్ లా, మహేంద్రగిరి వారాహి రెండూ సాలిడ్ కంటెంట్‌తోనే వస్తున్నాయి. మరోవైపు నారా రోహిత్ కూడా కెరీర్ మొదట్లో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలే చేసారు. మధ్యలో ట్రాక్ తప్పినా.. ప్రస్తుతం కపాలి, సౌండ్ ఇంజనీర్ అంటూ వచ్చేస్తున్నారు. అంతేకాదు వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. నాందీతో సెకండ్ ఇన్నింగ్స్ సీరియస్‌గా మొదలుపెట్టిన అల్లరి నరేష్.. తర్వాత మళ్లీ రేసులో వెనకబడిపోయారు. దాంతో కాస్త బ్రేక్ తీసుకుని.. ఆల్కహాల్, రంభ ఊర్వశి మేనక అంటూ వరస సినిమాలతో వచ్చేస్తున్నారు అల్లరి హీరో. సెప్టెంబర్ 4న సోషియో ఫాంటసీ టచ్ ఉన్న రంభ ఊర్వశి మేనక విడుదలవుతుంటే.. ఆల్కహాల్ త్వరలోనే రానుంది. మొత్తానికి ఈ హీరోలంతా నెమ్మదిగా జోరు పెంచేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Published on: Jul 28, 2026 07:40 PM
Follow Us