తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ టికెట్ల జారీ రద్దు

Updated on: Jan 10, 2026 | 4:15 PM

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 9 నుండి శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు చేసింది. తిరుమలలో ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేసిన 800 శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌గా మార్చింది. భక్తుల సౌలభ్యం, క్యూలైన్లు తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. భక్తుల సౌలభ్యం, క్యూలైన్ల లేకుండా చేయడమే లక్ష్యంగా ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్లను జనవరి 9వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వీటికి బదులుగా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం కింద, తిరుమలలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కోసం తిరుమలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్, మొబైల్ నంబర్ ధృవీకరణను తప్పనిసరి చేశారు. ఒక కుటుంబం నుంచి గరిష్ఠంగా నలుగురికి అంటే 1+3 మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నూతన విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్ టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఈ మార్పు చేశామని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో మూడు నెలల ముందుగా జారీ చేస్తున్న 500 శ్రీవాణి అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల విధానం, అలాగే తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న 200 టికెట్ల విధానం యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరు ట్రైన్ ట్రైన్ మిస్సైతే.. అదే టికెట్‌తో వేరే రైలు ఎక్కోచ్చా

దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు

Trump: గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేసిన ట్రంప్

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు ట్రైలర్.. పక్కా పండగ బొమ్మ

విజయ్, ప్రభాస్ కూడా ఆ భామ తర్వాతే.. ఒక చిత్రం తో సంచలనం