ఎస్వీ యూనివర్శిటీలో చిరుత ప్రత్యక్షం.. భయాందోళనలో విద్యార్ధులు

Updated on: Nov 28, 2025 | 1:12 PM

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాసాల వద్ద చిరుత సంచరించి కలకలం రేపింది. కోళ్ల షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు, టీటీడీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతను పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాస సముదాయం వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత సంచరించింది. అక్కడి కోళ్ల షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఉద్యోగుల కుటుంబాలు, విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. ఉద్యోగుల నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్దిసేపు అక్కడే తచ్చాడి, ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారం గురించి వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు యూనివర్శిటీ సిబ్బంది. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు చిరుత జాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ.. ప్రత్యేక బృందాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. రాత్రి సమయంలో బయట తిరగకుండా హెచ్చరించారు. క్యాంపస్ చుట్టూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయంగా ఉందని, రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించే వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉద్యోగులతో పాటు భక్తులు, స్థానికులు టీటీడీని కోరుతున్నారు. కొన్నినెలలుగా ఇక్కడ చిరుతలు తరచూ కనిపిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అలిపిరి చెక్‌పాయింట్ నుంచి ఎస్వీ క్యాంపస్‌లోకి చిరుతలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓటుకు నోటు వద్దే వద్దు.. కోతులను తరిమితే చాలు కొత్త సర్పంచ్‌ మీరే

123 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. 6 నిమిషాల పాటు పూర్తిగా చీకటి

Mosquitoes: ఒక్క సెకనులో 30 దోమలను చంపే సూపర్‌ వెపన్‌

స్మృతి మంథాన పెళ్లికి బ్రేక్‌ పలాష్ మోసం చేశాడా ??

Delhi: పాన్‌ మసాలా కోటీశ్వరుడి ఇంట్లో విషాదం