Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్

Updated on: Jan 19, 2026 | 6:49 PM

సంక్రాంతి పండుగ సెలవుల ముగింపుతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లు ఉన్నాయి. టీటీడీ ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 19 నుండి విడుదల చేయనుంది, భక్తులు వివరాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సంక్రాంతి పండుగ సెలవుల ముగింపు సందర్భంగా తిరుమల లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమలలో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో.. శ్రీవారి సర్వ దర్శనానికి 24గంటల సమయం పడుతోంది. ఇక.. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కష్ట నివారణ గోవిందా.. ఆపధ్బాందవ గోవిందా అంటూ భక్తులు ఓపికగా క్యూలైన్లలో సాగుతూ.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 నుంచి 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శనివారం 83,576 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.07 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మరోవైపు ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల కోటా వివరాలు టీటీడీ వెల్లడించింది. టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లను టీటీడీ మంజూరు చేస్తుంది. 22న ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌ వ‌సంతోత్స‌వాల‌ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: కెప్టెన్లకు డార్లింగ్ ఇస్తున్న టార్గెట్ ఏంటి ??

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ కు సరికొత్త ఛాలెంజ్

Sai Pallavi: బాలీవుడ్‌ లో సాయిపల్లవి ప్రూవ్ చేసుకోవాల్సిందే

Pawan Kalyan: ఓజీ వైబ్స్ ని కంటిన్యూ చేయనున్న పవన్ కల్యాణ్

హ్యాట్రిక్ హిట్ అందుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు