Andhra: రోడ్డు పక్కన పొదల్లో ఏవో చప్పుళ్లు.. అటుగా వెళ్తున్న ప్రయాణీకులు ఆగి చూడగా
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసులకు ఎలుగుబంట్లు బెడద తప్పటం లేదు. గత కొన్నేళ్లుగా కొండలు, అడవులు అంతరిస్తుండటంతో తాగునీరు, ఆహారం కోసం అవి తరచూ అరణ్యవాసాల నుంచి జనావాసాల బాట పడుతున్నాయి. తాజాగా జిల్లాలోని మందస మండలం అంబుగాం బొడ్లూరు గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసులకు ఎలుగుబంట్లు బెడద తప్పటం లేదు. గత కొన్నేళ్లుగా కొండలు, అడవులు అంతరిస్తుండటంతో తాగునీరు, ఆహారం కోసం అవి తరచూ అరణ్యవాసాల నుంచి జనావాసాల బాట పడుతున్నాయి. తాజాగా జిల్లాలోని మందస మండలం అంబుగాం బొడ్లూరు గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎలుగుబంట్లు సమీప జీడితోటల నుంచి రోడ్డుపైకి వచ్చి ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళాయి. అదే సమయంలో రోడ్డుపై అటువైపుగా ప్రయాణికులు వెళ్తూ ఎలుగుబంట్లు చూసి హడలిపోయారు. ఆ రోడ్డుపై కాసేపు ప్రయాణాలు ఆగిపోగా.. కాసేపటికి ఆ ఎలుగుబంట్లు రోడ్డు వెంబడి వెళ్లి సమీప జీడి తోటల్లోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు . అయినప్పటికీ స్థానిక గ్రామీణ ప్రజలు ఎలుగుబంట్లు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరిపైన దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు.