ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
విషజ్వరాలు, వివిధ రకాల వైరస్‌ల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతున్నారు. పోషకాహార లేమి కూడా ఈ సమస్యను మరింతగా పెంచుతోంది. శరీరంలో గాయాలు మానడానికి, రక్తం గడ్డకట్టడానికి ప్లేట్ లెట్లు తప్పనిసరి. తగిన సంఖ్యలో ప్లేట్ లెట్లు లేకుంటే... ప్రాణాలకే ప్రమాదం కూడా. అలాంటి ప్లేట్ లెట్ల సంఖ్యను సహజంగానే పెంచేందుకు కొన్ని రకాల ఆహారం తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి ఆకులు, బొప్పాయి పళ్లు ప్లేట్‌లెట్స్ పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. బొప్పాయిలో అధికంగా ఉండే విటమిన్ సి, కొన్ని రకాల ఎంజైమ్ లు రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడానికి తోడ్పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే దానిమ్మ పళ్లు. దానిమ్మ పండును వరప్రదాయిని అని నిపుణులు చెబుతారు. ఇందులో అధిక స్థాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ని బలోపేతం చేస్తాయని, ముఖ్యంగా రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడానికి తోడ్పడతాయని పేర్కొంటున్నారు. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు కూడా రక్తంలో ప్లేట్‌లెట్స్ పెరగడానికి దోహదపడతాయి. పాలకూర, కేల్, బ్రొకొలి వంటి ఆకుకూరలు, కూరగాయల్లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుందని, మన శరీరంలో రక్తం గడ్డకట్టేందుకు ఇది కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఏదో ఒక రకంగా తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.
ప్లేట్‌లెట్స్ పడిపోయాయా… ఈ ఆహారంతో సహజంగా..!రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను పడిపోకుండా చేసే మరో దివ్య ఔషధం గోధుమ గడ్డి. గోధుమ గడ్డి జ్యూస్ ను తరచూ తీసుకుంటుంటే శరీరంలో హీమోగ్లోబిన్ వృద్ధి చెందుతుందని, ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి అత్యంత అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు నువ్వులలో ఉంటాయని… అవి రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెతో వంట చేసుకున్నా… రోజూ ఒక స్పూన్ నేరుగా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇక గుమ్మడి పండ్లలో అధికంగా ఉండే విటమిన్ ఏ, కొన్ని ఎంజైములు మన శరీరంలో ప్లేట్ లెట్ల ఉత్పత్తికి తోడ్పడతాయని, ఇమ్యూనిటీని పెంచుతాయని… డెంగ్యూ వంటి వ్యాధులను ఎదుర్కోవడంలో తోడ్పడతాయని వివరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.