మీ పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకండి.. అది స్కార్లెట్‌ జ్వరం కావచ్చు

|

Mar 03, 2024 | 3:56 PM

నగరంలో ఇప్పుడు కొత్త వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. హైదరాబాద్‌లో చిన్నారులే టార్గెట్‌గా విస్తరిస్తున్న వ్యాధితో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. అదే స్కార్లెట్‌ జ్వరం. ఈ వ్యాధి గతంలోనూ కనిపించినప్పటికీ అంతంగా వ్యాప్తి చెందలేదు. తాజాగా ఈ జ్వరం చిన్నారులపై తన పంజా విసురుతోంది. నగరంలో వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు దీని బారినపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి.

నగరంలో ఇప్పుడు కొత్త వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. హైదరాబాద్‌లో చిన్నారులే టార్గెట్‌గా విస్తరిస్తున్న వ్యాధితో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. అదే స్కార్లెట్‌ జ్వరం. ఈ వ్యాధి గతంలోనూ కనిపించినప్పటికీ అంతంగా వ్యాప్తి చెందలేదు. తాజాగా ఈ జ్వరం చిన్నారులపై తన పంజా విసురుతోంది. నగరంలో వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు దీని బారినపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి. జ్వరంతో వస్తున్న ప్రతి 20 మంది చిన్నారుల్లో 12 మందిలో స్కార్లెట్ జ్వరం లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. గతంలోనూ ఈ వ్యాధి కనిపించినప్పటికీ ఇప్పుడు దీని తీవ్రత మరింతగా పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న చిన్నారుల్లో ఈ జ్వర లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది సాధారణ జ్వరమనో, లేదంటే వైరల్ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రమై ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. స్కార్లెట్ జ్వరం స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్హులైన అందరికీ 200 యూనిట్లవరకూ విద్యుత్‌ ఫ్రీ