AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..భారీగా పెరగనున్న ధరలు!

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..భారీగా పెరగనున్న ధరలు!

Samatha J
|

Updated on: Jan 16, 2026 | 9:02 AM

Share

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ ఇది. స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తీవ్రం కావడంతో స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు మొబైల్‌ ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నూతన టెక్నాలజీ ఏఐ కోసం ప్రత్యేక దృష్టి సారించిన సంస్థలు.. అప్‌గ్రేడ్‌ చేయడానికి భారీగా నిధులను వెచ్చిస్తున్నాయి.

ఇదే క్రమంలో ఈ నూతన సేవలను అందించడానికి చిప్‌ల సామర్థ్యం కూడా పెంచుకోవాల్సి వస్తున్నదని, కానీ గ్లోబల్‌ మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉన్నదని, వీటికి అధిక మొత్తంలో నిధులు వెచ్చించి కొంటున్నామని స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ప్రతినిధి తెలిపారు.మొబైల్‌ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి వీటి ధరలు పెంచక తప్పదని కంపెనీలు సంకేతాలిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రజలకు చౌకగా స్మార్ట్‌ఫోన్లు లభించే అవకాశాలు లేవని, విలువ-నూతన టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ఫోన్లు కావాలంటే అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి రావచ్చునని ఆయన చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో ఏఐ టెక్నాలజీతో తయారైన స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ ఉంది. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 2024లో 3 శాతంగా ఉండగా, 2025 తొలి ఆరు నెలల్లో 13 శాతానికి ఎగబాకిందని కౌంటర్‌పాయింట్‌ రీసర్చ్‌ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం 

ఇరాన్‌లో నిరసన కారులను అణచివేస్తున్న ప్రభుత్వం వీడియో

అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో

నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో

బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది