రోజూ 8 గంటలు కదలకుండా కూర్చుంటున్నారా ?? అయితే ఈ వ్యాధులు మీకు దగ్గరపడుతున్నట్లే
ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాలే చేస్తున్నారు. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసే ఉద్యోగాలే ఉండేవి. మన పూర్వీకులు పొలం పనులు, చేతి వృత్తుల పనులు చేసేవారు. దీంతో వారికి రోజంతా శారీరక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా కంప్యూటర్లు వచ్చేశాయి. దీంతో మన పని చాలా తేలికైపోయింది. శారీరక శ్రమను మొత్తానికే తగ్గించేశారు.
నూటికి 90 శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాలే చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇలాంటి జీవన విధానం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోజూ శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలని అంటున్నారు. రోజుకు 8 గంటల కన్నా ఎక్కువగా కూర్చుని పనిచేసే వారికి భవిష్యత్తులో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. వెన్నెముక పొట్ట, ఛాతి దగ్గర ఉండే కండరాలు బలహీనం అవుతాయి దీంతో వెన్ను నొప్పి మొదలవుతుంది. అలాగే చూపులో తేడా వస్తుంది. దృష్టి తగ్గుతుంది. తలనొప్పి సమస్య వేధిస్తుంది. ముందుగా బీపీ వస్తుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొన్ని సంవత్సరాలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అంటున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు బరువు పెరుగుతారు. ఎముకలు బలహీనంగా మారుతాయి. ఆయా భాగాలను కదిలించాలంటేనే నొప్పిగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది కనుక నిద్రపై ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ ఆందోళన బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పనిచేసే సమయంలో వీలైనంత వరకు లేచి తిరిగే ప్రయత్నం చేయాలి. ఆఫీసుల్లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించండి. సొంత వాహనాలు కాకుండా వీలున్నంత వరకు ప్రజారవాణాకు ప్రాధాన్యం ఇవ్వండి. మధ్యాహ్నం భోజనం చేయగానే సీట్‌లో కూర్చుని పనిచేయకుండా కాసేపు నిలబడి ఉండండి. ఆఫీసుల్లో మీటింగ్స్ పెడితే నిలబడి ఉండండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటిని మరిగిస్తే బ్యాక్టీరియా చనిపోతుందా..? అధ్యయనంలో ఆశ్చర్యపోయే నిజాలు
కరోనా బాధితులకు ముందుగానే ముసలితనం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ అధ్యయనం
తిరుపతిలో బైకు వెంటపడిన చిరుత.. తృటిలో..
రౌడీ బాయ్ పై గట్టిగా.. కంబ్యాక్ ఇచ్చిపడేశావ్‌పో..
Pallavi Prashanth: ఇంత బతుకు బతికి చివరకు.. పాపం! బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ