తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు
సైనిక వాహనంపై మెరుపుదాడి చేసి కఠువాకు సమీపంలో ఐదుగురు సైనికుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులు ఆ ఘటనకు ముందు స్థానికుల్ని బెదిరించినట్లు తాజాగా బయటపడింది. కణతకు తుపాకీ గురిపెట్టి, తమ కోసం భోజనం తయారు చేయించుకున్నారని కొందరు తెలిపారు. 10-15 మందికి సరిపడేంత ఆహారాన్ని వండి ఓ వ్యక్తికి అప్పగించిన మహిళను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు భావిస్తున్న మరో ముగ్గురిని కూడా భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.
సైనిక వాహనంపై మెరుపుదాడి చేసి కఠువాకు సమీపంలో ఐదుగురు సైనికుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులు ఆ ఘటనకు ముందు స్థానికుల్ని బెదిరించినట్లు తాజాగా బయటపడింది. కణతకు తుపాకీ గురిపెట్టి, తమ కోసం భోజనం తయారు చేయించుకున్నారని కొందరు తెలిపారు. 10-15 మందికి సరిపడేంత ఆహారాన్ని వండి ఓ వ్యక్తికి అప్పగించిన మహిళను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు భావిస్తున్న మరో ముగ్గురిని కూడా భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. జులై 8న దాడికి పాల్పడిన సమయంలో ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించినట్లు తెలిసింది. భద్రతా బలగాల నుంచి ఆయుధాలను దోచుకునేందుకు ప్రయత్నించారు. దీనిని మన సైనికులు తిప్పికొట్టారు. గాయపడినా సరే వారికి మాత్రం ఆయుధాలను ఇవ్వలేదు. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామ్ అయ్యేవరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించాడు. తమ కళ్లెదురుగానే ఐదుగురు సహచర సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు.. మరింత ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి వీరోచితంగా పోరాడారు. ఆయుధాలను తీవ్రవాదులు ఎత్తుకుపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య రెండు గంటలకుపైగా కాల్పులు జరిగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు
రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో చట్టం
పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్
గుడ్‌న్యూస్.. వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!