చానెల్ షోను ఓపెన్‌ చేసిన భవిత

Updated on: Dec 16, 2025 | 6:47 PM

ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తెలుగమ్మాయి భవిత మండవ సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ పాతికేళ్ల చిన్నది ఛానెల్ మెటియర్స్ డి’ఆర్ట్ 2026 ఓపెనింగ్ షోలో మొదటి భారతీయ మోడల్‌గా చరిత్ర సృష్టించింది. న్యూయార్క్ సబ్‌వేలో అనుకోకుండా డిస్కవరీ కావడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. గ్లోబల్ ర్యాంప్‌లపై దేశ గౌరవాన్ని నిలబెడుతున్న భవిత మండవ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం.

కళ్లలో ధైర్యం, ముఖంలో ఆత్మవిశ్వాసం, నడకలో హుందాతనం.. కలగలిసి పాతికేళ్ల హైదరాబాదీ చిన్నది ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ‘భవిత’ తెలుగమ్మాయి కావడం యావత్‌ దేశానికి గర్వకారణం. అసలు ఎవరీ భవిత.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్‌ దుస్తులను ప్రమోట్‌ చేసేయాడ్‌లో భవిత మండవ నటించింది. న్యూయార్క్ సబ్‌వేలో కిందకు దిగుతూ స్టార్ మోడల్‌గా ఇతర మోడళ్ల కంటే ముందుగా వాక్‌ చేయడమే ర్యాంప్‌ ఓపెనింగ్‌ అంటారు. ఈ పాతికేళ్ల చిన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ షోల్లో పాల్గొంటూ ర్యాంప్‌ వాక్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చానెల్ మెటియర్స్ డి’ఆర్ట్ 2026 ఓపెనింగ్‌ షోలో మొదటి లుక్‌ భవితది కావడం విశేషం. ఎందుకంటే ఇలా ఓ ఛానెల్‌ షోను ఓపెన్‌ చేసిన మొట్టమొదటి భారతీయ మోడల్‌గా ఘనత సాధించింది. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఇది గొప్ప గౌరవం. భారత్‌లో ఆర్కిటెక్చర్‌ కోర్సు చదివిన భవిత.. అసిస్టివ్‌ టెక్నాలజీ కోసం అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్సిటీలో చేరింది. కానీ తాను ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెడతానని అస్సలు ఊహించలేదట. న్యూయార్క్‌లో ట్రైన్‌ దిగిన అనంతరం సబ్‌వే స్టేషన్‌లో వస్తుండగా.. ఆ క్షణాలే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి. రెండు వారాల ముందు ఓ సబ్‌వే స్టేషన్‌లో భవిత మండవ ను గుర్తించిన స్కౌటింగ్ టీమ్.. ఆ షో కోసం ఆమెను ఎంపిక చేసారు. మొదటిసారి ఆమెను కాస్ట్ చేసారు మాథ్యూ బ్లేజీ.. ఆయనో ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్. ఆయన మార్గదర్శకత్వంలో ఆమె ర్యాంప్‌ వాక్‌ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వీడియోను భవిత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. బోవరీ సబ్‌వే స్టేషన్ మెట్లపై దిగుతూ ర్యాంప్‌ వాక్‌ చేసింది. ఈ షోను టీవీలో చూసిన భవిత తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌…భారీగా తగ్గిన బంగారం ధరలు

ఆటగాళ్లపై రవీంద్ర జడేజా భార్యసెన్సేషనల్ కామెంట్స్

చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ

దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్‌ వన్‌… కాశీ తర్వాత ఇక్కడే…

వావ్‌.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా