తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. అమలు ఇలా
మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణంతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకొచ్చింది. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌరసరఫరాలశాఖ నిర్ణయం తీసుకుంది.
మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణంతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకొచ్చింది. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌరసరఫరాలశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రీయింబర్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 340 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.955. సూర్యాపేట లో రూ.974. మహబూబ్‌నగర్‌లో రూ.958 ఇలా రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కోచోట ఒక్కో ధర ఉంది. రవాణా ఛార్జీల వ్యత్యాసమే ఇందుకు కారణం. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 11.58 లక్షలు ఉండగా, వీరికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ వస్తోంది. మహాలక్ష్మిలో ఎంపికైన గ్యాస్ వినియోగదారులు సిలిండర్‌పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోను.. మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత అధికంగా ఉంటే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉజ్జయినిలో 85 అడుగుల ఎత్తైన టవర్‌పై వేద గడియారం
డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు
ఫైవ్ స్టార్ హోటళ్లు లేని ఊళ్లో అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుక.. మరి అతిథుల పరిస్థితేంటో
ఢిల్లీ మెట్రోలో గోల్డెన్ లైన్.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం
రైల్వే ట్రాక్‌పై ట్రక్ బోల్తా.. ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు