శభాష్ పోలీసన్న.. ఓ మహిళ ప్రాణాన్ని కాపాడిన ఖాకీలు..!

Edited By:

Updated on: Feb 08, 2025 | 5:01 PM

రెప్పపాటులో ఓ వివాహిత ప్రాణాలను రాచకొండ పోలీసులు కాపాడారు. సమయస్పూర్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ మహిళను రక్షించారు. కుటుంబ సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు సకాలంలో స్పందించి, డోర్లు బద్దలుకొట్టి, మహిళను రక్షించారు.

ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వివాహితను కాపాడి ఇద్దరు పోలీసులు అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఒక మహిళ నిండు ప్రాణాన్ని కాపాడి, సమయానికి స్పందించి వృత్తిధర్మాన్నే కాదు.. మానవత్వాన్ని చాటుకున్న ఆ ఇద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు, తరుణ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజువారీ లాగే విధుల్లో ఉండగా డయల్ 100కు ఒక సమాచారం అందింది. బాలాపూర్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడుతుందని వచ్చిన ఆ సమాచారంతో వెంటనే స్పందించారు కానిస్టేబుళ్ళు రాజు, తరుణ్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్

చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం

Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??

టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!

రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ

Published on: Feb 08, 2025 01:00 PM