ఛీఛీ..మేము కాంగ్రెస్‌లో కలువనేలేదు వీడియో

Updated on: Sep 17, 2025 | 4:06 PM

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్‌ పెంచుతోంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. తెలంగాణ స్పీకర్‌కు 8మంది MLAలు వివరణ ఇచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలమే అంటూ స్పీకర్‌కి లేఖ రాశారు. తాము పార్టీ మారలేదంటూ స్పీకర్‌కు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామంటూ వివరణ ఇచ్చారు. తమ మెడలో సీఎం వేసింది కాంగ్రెస్‌ కండువా కాదని.. జాతీయ జెండా కండువా అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికీ BRS ఎమ్మెల్యేలమే అంటూ ఫొటోలు, వేతన రసీదులు, ఆధారాలను సమర్పించారు. ఇక, PAC చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం సంప్రదాయమంటూ లేఖలో వివరణ ఇచ్చారు అరెకపూడి గాంధీ. దాంతో, MLAలను వేర్వేరుగా విచారించాలని స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్‌కు 8మంది MLAలు సమాధానం ఇవ్వగా.. వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి.8మంది ఎమ్మెల్యేల వివరణలను బీఆర్‌ఎస్‌కి పంపారు అసెంబ్లీ సెక్రటరీ. ఎమ్మెల్యేల వివరణపై మూడ్రోజుల్లో అభిప్రాయం చెప్పాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వివరణను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పంపారు అసెంబ్లీ సెక్రటరీ. అరెకపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్‌ వివరణలు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కి పంపారు. పోచారం, సంజయ్‌ వివరణలు.. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి పంపారు అసెంబ్లీ కార్యదర్శి. కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి వివరణలు.. చింతా ప్రభాకర్‌కి పంపారు. తెల్లం వెంకట్రావు వివరణను వివేకానంద్‌గౌడ్‌కి పంపించారు అసెంబ్లీ కార్యదర్శి. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడ్రోజుల్లోనే అభిప్రాయం చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం ఆదేశాల కారణంగా సమయం పొడిగింపు లేదని అసెంబ్లీ కార్యదర్శి తేల్చి చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం :

అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో

దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో

ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్‌ వీడియో

ఆపరేషన్‌ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో

Published on: Sep 15, 2025 03:54 PM