మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్‌

Updated on: Sep 08, 2025 | 9:44 PM

రాబోయే 3 రోజులలో తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని 14 జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక.. వరంగల్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా వరంగల్ రైల్వే అండర్‌బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను పోలీసులు, రెస్క్యూ బృందాలు తాళ్లతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అనంతరం క్రేన్‌ సాయంతో బస్సులను వరద నుంచి బయటకు తీసి, రాకపోకలను పునరుద్ధరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటో డ్రైవర్‌కు దొరికిన బంగారం బ్యాగ్‌.. డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్

త్వరలో అందుబాటులోకి టీ ఫైబర్ సేవలు.. కంప్యూటర్లుగా మారనున్న పాత టీవీలు

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ

ఏఐ రంగంలో ఉద్యోగాలు కావాలా? ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన