Telangana: తెలంగాణాలో పెరిగిన ఎండల తీవ్రత.. ఈ రెండు చోట్లే టాప్.!
తెలంగాణలో వాతావరణం మారిపోయింది.. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత బాగా పెరిగింది. సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐదు రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో వాతావరణం మారిపోయింది.. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత బాగా పెరిగింది. సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐదు రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత కనిపిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు మొదలయ్యాయి. ఆదిలాబాద్, రామగుండంలలో సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గతేడాదిలాగే.. ఈ ఏడాది వేసవిలోనూ అత్యంత వేడిగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత వేసవిలో ఎల్‌నినో ప్రభావంలా ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు ఉంటాయంటున్నారు. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశలున్నాయని.. వాతావరణ మార్పుల వల్లే సాధారణ ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతున్నాయంటున్నారు. ఈనెల చివరి వారంలో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. మార్చి 20 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos