తెలంగాణలో Ed.CET, ICET-2026 షెడ్యూల్స్ విడుదల
తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్. 2026 విద్యా సంవత్సరానికి TG Ed.CET, TG ICET ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష తేదీల పూర్తి వివరాలను ప్రకటించింది. కాకతీయ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలు ఈ పరీక్షలను నిర్వహిస్తాయి. గడువులోగా దరఖాస్తు చేసుకోవడం ముఖ్యం.
తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి TG Ed.CET, TG ICET ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు బుధవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG Ed.CET పరీక్షను ఈ ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 20, 2026న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 18 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పరీక్షను మే 12, 2026న రెండు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇదే విధంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG ICET పరీక్ష బాధ్యతను నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఫిబ్రవరి 12 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. మార్చి 16 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 13, 14 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్లు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన.. చూస్తే గుండె తరుక్కుపోతుంది
Srisailam: భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
రూ.99/- కే టికెట్…! హిట్టు కొట్టేందుకు మనోడి నయా స్ట్రాటజీ
TOP 5 ET: ఇక NTR విషయంలో జాగ్రత్త !! తారక్‌కు కోర్టు రక్షణ !!