Revanth Reddy: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే?

|

Nov 06, 2024 | 9:47 PM

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కులగణన ప్రక్రియ గూర్చి సీఎం గవర్నిర్‌కు వివరించారు.

హైదరాబాద్‌లో రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులగణన సర్వే తీరును గవర్నర్‌కు  సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను సీఎం గవర్నర్ కు వివరించారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవనుందని సీఎం చెప్పుకొచ్చారు. 2025 చేపట్టే దేశవ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం గవర్నర్‌ను కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Nov 06, 2024 09:46 PM