Watch: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏకైక లక్ష్యం అదేనంటూ..

|

Aug 25, 2024 | 9:41 PM

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపుపై వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామన్నారు. శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించే ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నామని చెప్పారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామన్నారు.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపుపై వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామన్నారు. శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించే ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నామని చెప్పారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామన్నారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందన్నారు. చెన్నై, వయనాడ్‌లో అలాంటి పరిస్థితులను చూశామని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాల్సిన అవసరం ఉందన్నారు.శ్రీమంతులు విలాసాల కోసం ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారని.. అందులోని వ్యర్థాలను చెరువుల్లోకి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ విలాసవంతమైన భవనాల వ్యర్థాలు తాగునీటిలో కలుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువులను రక్షించాలనే ఏకైక లక్ష్యంతోనే కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published on: Aug 25, 2024 09:38 PM